KNR: జిల్లా కేంద్రంలోని CSI కేథడ్రిల్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముందస్తు క్రిస్టమస్ పండుగ వేడుకలకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.