BHPL: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.