NTR: మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బట్టు గోపి (23) అనే యువకుడు ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై మైలవరం ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.