SRPT: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. సిమెంటు ఊడిపోయి, ఇనుప సువ్వలు కనిపించి, వంగిపోయిన ఆ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి స్తంభాన్ని మార్చాలని అధికారులను కోరుతున్నారు.