SS: గోరంట్ల మండలం 1వ వార్డులో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలికలు)లో కల్తీ ఆహారం తిని కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి బుధవారం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటగదిని, ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. అనారోగ్యానికి గురి అయిన బాలికలకు వైద్యం అందిస్తామన్నారు.