AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. మలికీపురం మండలంలోని గూడపల్లికి ఆయన చేరుకున్నారు. ఇటీవల కేశనపల్లిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించారు. సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరీక్షించారు. రైతులు, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.