AP: కోనసీమ కొబ్బరిరైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నా టూర్ తొలి అడుగు. వరాలు ఇవ్వడానికి నేను సీఎం స్థానంలో లేను, సీఎంనే అడగాలి. గత ప్రభుత్వం ఇక్కడ ఐదేళ్లు పూడికలు తీయలేదు. డబ్బులు పథకాలకు ఇచ్చుకోండి.. కానీ అభివృద్ధిని మరచిపోయారు’ అని మండిపడ్డారు.