VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి అప్పన్నపాలెంలో టీ. రాము అనే వ్యక్తికి నిన్న రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు గుర్తించి 108లో విశాఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాము ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. మృతుడు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.