కృష్ణా: వేడి సాంబారు గిన్నెలో పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం ఫంక్షన్లో చిన్నారి ఆడుకుంటూ భోజనానికి సిద్ధం చేసిన సాంబారు గిన్నెపై కూర్చుంది. ప్లేటు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా వేడి సాంబారులో పడిపోయింది. దాంతో చిన్నారి శరీరం పూర్తిగా కాలిపోయింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచింది.