MBNR: జిల్లా కేంద్రంలోని అబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల రాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు వరం లాంటిదని వెల్లడించారు. రాజ్యాంగం మూలంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు విద్య ఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరిగిందన్నారు.