SRPT: నాగారం నూతన ఎస్సైగా ఎస్.చిరంజీవి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ టు టౌన్ పనిచేసిన ఈయన బదిలీపై నాగారంకు వచ్చారు. మండల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.