కరీంనగర్ జిల్లాకు చెందిన ఒకినావా మార్షల్ అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ కే. వసంత్ కుమార్ జాతీయ కరాటే పోటీలకు చీఫ్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. విశాఖపట్నంలో రేపటి నుంచి 30వ తేదీ వరకు జరిగే కరాటే పోటీల్లో ఆయన చీఫ్ రెఫరీగా విధులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వసంత్ కుమార్ నియామకం పట్ల పలువురు కరాటే మాస్టర్లు హర్షం వ్యక్తం చేశారు.