కృష్ణా :పామర్రు వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.ఈ క్రమంలో వైసీపీ నేతలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1949 నవంబర్ 26వ తేదీన న్యాయం, స్వేచ్ఛ, మానవత్వం పునాదులతో పునాదులతో రూపొందించబడిందని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.