MBNR: రాజపూర్ మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన సాయి శ్రీనివాస్ గ్రామంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి రూ.30 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సాయి శ్రీనివాస్‌ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.