ELR: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాల సందర్భంగా మండవల్లి, ముదినేపల్లి మండలాల్లోని సింగరాయపాలెం గ్రామంలో ఇవాళ జరుగనున్న వేడుకల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, వాలంటీర్లు, విద్యార్థులకు భద్రతా జాగ్రత్తలపై ఆయన వివరించారు.