TPT: పాకాల మండలం ఊట్లవారిపల్లి నందు వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రమణ్య స్వామి షష్టి సందర్భంగా కళ్యాణోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా పాల్గొన్నారు. ముందుగా ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.