AP: ప్రజల గుండెల్లో అంబేద్కర్ శాశ్వతంగా ఉండిపోతారని మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అన్నారు. విజన్ ఉంటే సరిపోదని.. దాన్ని అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. నిరంతర శ్రమతోనే అనుకున్నది సాధించగలమని చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. చిన్న వయసులోనే తాను ఎమ్మెల్యే అయ్యానని.. నాలుగో సారి సీఎంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.