ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై స్టాంప్స్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి మాజీ ఎంపీ తలారి రంగయ్య దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును CBIకు అప్పగించాలని పిటిషనర్ కోరారు. విచారణకు హాజరైన ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు.