AP: కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు. అరటి రైతుల బాధలు చూసైనా ప్రభుత్వానికి బుద్ధిరావాలని విమర్శించారు. ‘బనానా కోల్డ్ స్టోరేజ్‌ను మేం ప్రారంభించాం. 18 నెలల నుంచి కోల్డ్ స్టోరేజ్‌ను నడపడం లేదు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశాం. రైతులకు చంద్రబాబు చేసింది గుండుసున్నా. త్వరలో రైతుల తరఫున ఉద్యమం చేస్తా’ అని వెల్లడించారు.