HYD: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ‘X’ వేదికగా తెలిపారు. కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా APK లింక్స్‌ను సర్క్యులేట్ చేస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రజల బ్యాంక్, పర్సనల్ డేటాను వారు పొందుతున్నారని చెప్పారు. దీంతో ప్రజలు APK లింక్స్‌ను ఓపెన్ చేయొద్దన్నారు.