VSP: విశాఖలో 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైసీపీ విశాఖ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడడరమణి కుమారి పాల్గొన్నారు.