MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామన్న ప్రభుత్వ హామీ ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. మండలంలోని 29 గ్రామపంచాయతీలతో పాటు కడెం, దస్తూరాబాద్ మండలాల ప్రజలకు జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సేవలను అందిస్తోంది. దీంతో ఆసుపత్రిని 30 పడకలకు పెంచి వైద్యులు, సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం 2019లో హామీ ఇచ్చిన ఇప్పటికీ నెరవేరలేదని స్థానికులన్నారు.