HNK: కాజీపేట రైల్వే స్టేషన్లో పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ, పాత నేరస్థుల గుర్తింపునకు లక్ష్యంగా ఎస్సై శివ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌తో పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు తరచుగా కొనసాగనున్నట్లు వెల్లడించారు.