AP: టీటీడీకి ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన భారీ విరాళం ఇచ్చారు. తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఈ విరాళం ఇచ్చారు. 2012లోనూ ఆయన రూ.16 కోట్లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతకు టీటీడీ తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు.