ADB: ఉట్నూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల కారణంగానే దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్, రమేశ్, పాల్గొన్నారు.