హోమ్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు WTC పాయింట్స్ టేబుల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. గౌహతి టెస్ట్ ఓటమితో 4 నుంచి 5వ స్థానానికి దిగింది. పాయింట్స్ % కూడా 54.16 నుంచి 48.15కు పడిపోయింది. ఈ విజయంతో సౌతాఫ్రికా(75) 3 నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా(100) టాప్లో ఉండగా.. శ్రీలంక(66.67), పాకిస్థాన్(50) వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.