AP: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి అనిత వెల్లడించారు. నేర నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని అన్నారు. త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.