KDP: బద్వేలులో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నిర్వహిస్తున్న HP పెట్రోల్ బంక్ మూతపడింది. ఓ నిర్వహక ఉద్యోగి దురుసు ప్రవర్తన కారణంగా కార్మికులు బాయ్‌కాట్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. కార్మికుల బాయ్‌కాట్‌తో బంక్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.