కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల ప్రధాని ప్రసంగాన్ని ప్రశంసించి సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలకు ఆయన పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేంద్రానికి సహకరించకపోతే, అభివృద్ధి పనులు జరగవు. అన్నీ అలానే ఆగిపోతాయి. కొన్ని పనులు జరగాలంటే, వారికి (కేంద్రానికి) సహకారం తప్పనిసరి’ అంటూ థరూర్ సొంత పార్టీ నేతలకు చురకలంటించారు.