VZM: గజపతినగరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 76వ అఖిలభారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సీఈవో నారాయణరావు పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ సహకార అధికారి సత్యనారాయణ రాజ్యాంగ పీఠికను చదవగా, అసిస్టెంట్ రిజిస్టర్ శంకరరావు రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఇకపై ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిపేందుకు నిర్ణయించారు.