TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గతంలో 24 శాతం ఉన్న రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గాయని మండిపడ్డారు. కొన్ని మండలాల్లో ఒక్క గ్రామానికి కూడా బీసీ రిజర్వేషన్ దక్కలేదన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం మోసమన్నారు.