CTR: ది అపోలో యూనివర్సిటీలో బుధవారం ఐబీఎం–ఇండస్ట్రీ లెర్నింగ్ నెట్వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ పాల్గొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన స్పష్టం చేశారు.