AP: పోలీస్ శాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం రేపింది. కోట్లు ఆశ చూపి వందమంది పోలీసు సిబ్బందితో లోవరాజు అనే పోలీసు కానిస్టేబుల్ పెట్టుబడి పెట్టించాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే నెలకు రూ.50 వేలు వస్తుందంటూ బురిడీ కొట్టించాడు. ఫిర్యాదు అందకపోయినా విశాఖ పోలీసు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.