TG: హైదరాబాద్లో ఓ వ్యక్తి తన భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఉరేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు ఆమె సమాచారం ఇవ్వడంతో.. వెంటనే అతణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నార్సింగి పరిధిలో జరిగింది. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.