TG: వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని ద్వారా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. త్వరలో 2,3 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయన్నారు. 1500 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం అవుతోందన్నారు. స్థానికులకే ఇక్కడ ఉపాధి కల్పించాలన్నారు. టెక్స్టైల్ రంగానికి తెలంగాణ హబ్ కావాలన్నదే లక్ష్యమన్నారు.