AP: పరకామణి చోరీ కేసు విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఏమైనా సభలు పెట్టుకుని భాషా ప్రావీణ్యాన్ని భూమన ప్రదర్శించాలని పేర్కొన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఆస్తుల బదలాయింపు ఒప్పందంపై భూమన ఎందుకు సంతకం చేశారని ప్రశ్నించారు.