ATP: రామగిరి మండలంలో ఈ నెల 28న ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరిటాల సునీత కోరారు.