WNP: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఘణపురం మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యాన్ని ఎలాంటి తాళ్లు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు.