MBNR: మిడ్జిల్ మండలం మంగళిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలతో పాటు మినీ అంబులెన్స్ అందిస్తానని గురువారం చందూలాల్ ప్రకటించారు. అదనంగా ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ బోర్డ్, మినరల్ వాటర్ ప్లాంట్, వివాహమైన ఆడబిడ్డకు రూ.5 వేలు ఇస్తానన్నారు. మంగళిగడ్డను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.