NLG: చిట్యాల మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మొదటిరోజు మండలంలో సర్పంచ్ స్థానాలకు 28, వార్డు స్థానాలకు 21 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. గుండ్రాంపల్లి సర్పంచ్ స్థానానికి అత్యధికంగా 4,ఆరెగూడెం, చిన్నకాపర్తి ల్లో 3 చొప్పున వచ్చాయి.