BDK: సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ప్రాణాల రక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. జిల్లా కేంద్రంలో అత్యాధునిక సేవలతో కూడిన ప్రత్యేక క్యాన్సర్ హాస్పిటల్‌ను మంజూరు చేయాలన్నారు.