AP: లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈరోజు ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి ఏసీబీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. దీంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.