KRNL: సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.