AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రజాస్వామ్యానికి శక్తిమంతమైన పునాది వేశారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మాకు మార్గదర్శకం. అంబేద్కర్ దార్శనిక నాయకత్వంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో మన ప్రజాస్వామ్యానికి పునాది పడింది’ అని పేర్కొన్నారు.