MDK: ఇసుక బజార్ రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. నర్సాపూర్ ఇసుక బజార్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక రవాణా, నిల్వలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణ పనులకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.