ATP: శివమాల ధరించిన భక్తులు తాడిపత్రి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు పాదయాత్రను ప్రారంభించారు. శివనామ స్మరణ చేస్తూ భక్తులు బృందాలుగా బయలుదేరారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో భక్తుల నిష్ట, శ్రద్ధ కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ యాత్రకు సంబంధించిన దృశ్యాలు భక్తి భావాన్ని చాటిచెప్పాయి.