VZM: జిల్లా వెలుగు కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళలపై శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం సమాజం మొత్తం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.