WG: పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి.