AP: రాష్ట్రంలో డిసెంబరు 3, 4, 5 తేదీల్లో 6వ జాతీయ ఏకలవ్య గురుకుల విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 1,800 మంది గిరిజన విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 110 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజధాని అమరావతి సమీపంలోని కేఎల్ వర్సిటీ వేదికగా వీటిని నిర్వహించనున్నారు.