SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. ఇవాళ ఈ వేడుకలను నిర్వహించాలని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేపించారు.